ఆదిలాబాద్ జిల్లా సీపీవో కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుత్తేదారు నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఉప గణాంక అధికారి ప్రదీప్ పట్టుబడ్డాడు. ఓవైపు అవినీతి నిరోధక అవగాహన వారోత్సవాలు జరుగుతుండగానే.. ఉప గణాంక అధికారి అనిశా వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది.
ఏసీబీ వలకు చిక్కిన ఉప గణాంక అధికారి
అనిశా అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తరచూ ఏదో ఒకచోట ఏసీబీ అధికారుల వలకు చిక్కుతూనే ఉన్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా సీపీవో కార్యాలయంలో రూ. 4 వేల లంచం తీసుకుంటూ ఓ అధికారి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారు.
ఏసీబీ వలకు చిక్కిన ఉప గణాంక అధికారి
ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి గ్రామంలో గుత్తేదారు శరత్ రూ.5 లక్షల విలువైన సీసీ రోడ్డు పనులు చేపట్టారు. ఆ బిల్లు జారీకి ఉప గణాంక అధికారి ఇబ్బందులకు గురి చేస్తుండటం వల్ల శరత్ అనిశాను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం గుత్తేదారు శరత్.. కార్యాలయానికి వెళ్లి ఉప గణాంక అధికారికి రూ. 4 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
నిందితుడు ప్రదీప్‌ను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు కరీంనగర్ రేంజ్ డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
ఇదీ చూడండి: 'అధికారులు, సిబ్బంది కృషితో ఆర్టీసీ ఆదాయం పెంపు'
Last Updated : Dec 4, 2020, 5:13 PM IST