తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మెదక్​ అదనపు కలెక్టర్​ నగేశ్​ ఇంట్లో అనిశా సోదాలు - additional collector nagesh

మెదక్​ జిల్లా నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి రైతు ఫిర్యాదు మేరకు అదనపు కలెక్టర్​ నగేశ్​ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

acb raids in medak additional collector nagesh
acb raids in medak additional collector nagesh

By

Published : Sep 9, 2020, 12:38 PM IST

Updated : Sep 9, 2020, 1:21 PM IST

మెదక్‌ అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో మాచవరంలోని నగేశ్‌ ఇంట్లో సోదాలు జరుపుతున్నారు. నర్సాపూర్‌ మండలం చిప్పలతుర్తి రైతు ఫిర్యాదు మేరకు ఈ సోదాలు చేపట్టినట్లు అనిశా డీఎస్పీ తెలిపారు.

112 ఎకరాల వ్యవసాయ పట్టా భూమికి ఎన్‌వోసీ కావాలని అదనపు కలెక్టర్​ను కోరగా... రూ. కోటీ 12 లక్షలు డిమాండ్‌ చేసినట్లు బాధిత రైతు ఆరోపించారు. నగేశ్‌ ఆస్తులపై ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Last Updated : Sep 9, 2020, 1:21 PM IST

ABOUT THE AUTHOR

...view details