తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ - కామారెడ్డి సీఐ అరెస్ట్

కామారెడ్డి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అ.ని.శా. విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీశ్‌కు సహకరించిన పట్టణ ఎస్‌ఐ గోవింద్ అరెస్టయ్యారు.

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో ఏసీబీ విచారణ

By

Published : Nov 26, 2020, 4:31 PM IST

కామారెడ్డి జిల్లా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కేసులో అ.ని.శా. విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ కేసులో సీఐ జగదీశ్‌కు సహకరించిన పట్టణ ఎస్‌ఐ గోవింద్ అరెస్టయ్యారు. అనంతరం గోవింద్‌ను ఏసీబీ అధికారులు విచారించారు.

సీఐ జగదీశ్‌ ఇంట్లో సోదాల సమయంలో ఎస్‌ఐ గోవింద్ ఫోన్‌ స్విచ్‌ఆఫ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెండ్రోజుల నుంచి విధులకు హాజరవుతున్న ఎస్‌ఐని ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ కేసులో సీఐ జగదీశ్​కు ఎస్సై గోవింద్ సహకరించినట్లుగా విచారణ సమయంలో తేలగా... అతడిని విచారిస్తోంది.

ఇదీ చూడండి:కామారెడ్డి సీఐ జగదీశ్​ ఇంటిపై ఏసీబీ సోదాలు

ABOUT THE AUTHOR

...view details