ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ అనిశా అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడుల సమయంలో నర్సింహారెడ్డి సుమారు రూ. 75 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ భూములు, ఇళ్లు, ఇంటి స్థలాలు, ప్లాట్లు, ప్రామిసరీ నోట్లు, నగదు, బంగారం సోదాల సమయంలో బయటపడ్డాయి.
ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్
మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని అనిశా అధికారులు ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై అనిశా కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
ఏసీపీ నర్సింహారెడ్డిని కస్టడీకి అప్పగించాలంటూ పిటిషన్
నర్సింహారెడ్డికి స్థిరాస్తి రంగంలో ఇంకా ఏమైనా పెట్టుబడులు పెట్టారా? బినామీల పేరిట ఎంత మేరకు ఆస్తులు కలిగి ఉన్నాయి.. తదితర అంశాలపై మరింత లోతుగా విచారించేందుకు ఏసీపీ నర్సింహారెడ్డిని ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై అనిశా కోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండిఃమల్కాజిగిరి ఏసీపీపై వేటు... ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ
TAGGED:
malkaj giri acp latest news