కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో మొదటి రోజు అనిశా విచారణ ముగిసింది. నిందితులకు పీపీఈ కిట్లు వేసి విచారించారు. నాగరాజు ఇంట్లో దొరికిన డబ్బు, విలువైన భూ పత్రాలపై ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు తహసీల్దార్ నాగరాజు, ఇతర నిందితులు సమాధానం ఇవ్వలేదు.
ఎంత ప్రశ్నించినా మౌనమే తహసీల్దార్ సమాధానం - తహసీల్దార్ నాగరాజును విచారించిన ఏసీబీ
కీసర తహసీల్దార్ నాగరాజు కేసులో మొదటి రోజు అనిశా విచారణ ముగిసింది. నాగరాజు ఇంట్లో దొరికిన డబ్బు, విలువైన భూ పత్రాలపై అధికారులు ప్రశ్నించారు. పలు ప్రశ్నలకు తహసీల్దార్ నాగరాజు, ఇతర నిందితులు సమాధానం ఇవ్వలేదు. రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.
![ఎంత ప్రశ్నించినా మౌనమే తహసీల్దార్ సమాధానం mro nagaraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8553447-711-8553447-1598360064465.jpg)
mro nagaraju
డబ్బుపై స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్ స్పష్టత ఇవ్వలేదు. లాకర్లపై తనకు ఎలాంటి సమాచారం లేదని తహసీల్దార్ నాగరాజు తెలిపారు. రేపు మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. విచారణ అనంతరం నలుగురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Last Updated : Aug 25, 2020, 6:42 PM IST