మెదక్ పూర్వ అదనపు కలెక్టర్ నగేశ్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదయింది. రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులను నగేశ్ కూడబెట్టినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు.
రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు - Medak former Additional Collector Nagesh case
![రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు Medak former Additional Collector Nagesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9048673-608-9048673-1601822410318.jpg)
19:04 October 04
రూ.3.26 కోట్ల విలువైన ఆస్తులు.. మాజీ అదనపు కలెక్టర్ నగేశ్‌పై మరో కేసు
మేడ్చల్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్‌లో నగేశ్‌కు ఆస్తులు ఉన్నట్లు అనిశా అధికారుల దర్యాప్తులో తేలింది. డ్యూప్లెక్స్ విల్లా, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, కార్లతో పాటు బ్యాంకులో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నగేశ్ బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు అనిశా అధికారులు తెలిపారు.
నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి నగేశ్.. కోటీ 12 లక్షలు లంచం తీసుకున్నారు. ఈ కేసులో నగేశ్‌తో పాటు ఆర్డీవో అరుణరెడ్డి, తహసీల్దార్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం, జీవన్‌గౌడ్‌లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఐదుగురు నిందితులు చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
ఇవీచూడండి: అదనపు కలెక్టర్ నగేశ్.. ఖైదీ నంబర్ 9444