తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గుండెపోటుతో మృతిచెందిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్​ - ఏసీబీ డీఎస్పీ ప్రతాప్​ మృతి తాజా వార్తలు

పోలీస్ శాఖలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్​ గుండెపోటుతో మరణించారు. కొంపల్లిలోని తన నివాసంలో తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

acb dsp pratap died due to heart attack at kompalli
గుండెపోటుతో ఏసీబీ డీఎస్పీ ప్రతాప్​ మృతి

By

Published : Jun 15, 2020, 11:01 AM IST

అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ప్రతాప్​ గుండెపోటుతో మృతి చెందారు. కొంపల్లిలోని తన నివాసంలో తెల్లవారుజామున 6 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ప్రతాప్​ గతంలో ముషీరాబాద్​ ఎస్సైగా, చిక్కడపల్లి డీఐగా, నగర ట్రాఫిక్​ ఏసీపీగా విధులు నిర్వర్తించారు. వారం క్రితం ఓ కేసు విషయంలో సస్పెండ్​ అయినట్లు సమాచారం.

మరోవైపు ప్రతాప్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, అధికారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీచూడండి: కరోనా విజృంభణ- 80 లక్షలకు చేరువలో కేసులు

ABOUT THE AUTHOR

...view details