ఆదాయానికి మించి ఆస్తుల అంశంలో అనిశాకు చిక్కిన ఏసీపీ నర్సింహారెడ్డిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను నాలుగు రోజుల పాటు అనిశా కస్టడీకి ఇచ్చేందుకు న్యాయస్థానం అనుమతించింది. అక్టోబరు 5 నుంచి 8 వరకు విచారించనున్నారు.
ఏసీపీ నర్సింహారెడ్డి పెట్టుబడులెక్కడ.. బినామీలెవరు..! - హైదరాబాద్ నేరవార్తలు
అక్రమాస్తుల కేసులో అనిశాకు చిక్కిన ఏసీపీ నర్సింహారెడ్డి నుంచి పూర్తి సమాచారం సేకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థిరాస్తి రంగంలో ఎంత పెట్టుబడి పెట్టారు.. బినామీలుగా ఎవరు వ్యవహరించారు అనే కోణంలో విచారించనున్నారు.
నర్సింహారెడ్డి.. పెట్టుబడులు ఎక్కడ పెట్టారు.. బినామీలెవరు..!
ప్రస్తుతం నర్సింహారెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆయన నివాసంలో సోదాల సమయంలో 75 కోట్ల రూపాయల అక్రమాస్తులు, బంగారం, నగదు, రెండు బ్యాంకు లాకర్లను అనిశా అధికారులు గుర్తించారు. స్థిరాస్తి రంగంలో సదరు అధికారి ఎంత మేరకు పెట్టుబడులు పెట్టారు.. అక్రమాస్తులకు ఎవరెవరు బినామీగా వ్యవరించారు.. అనే కోణంలో దర్యాప్తు జరపనున్నారు. ఆయనను విచారించిన సందర్భంగా మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది.