తెలంగాణ

telangana

ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ'

By

Published : Oct 5, 2019, 5:32 PM IST

ఈఎస్ఐ కుంభకోణం నిందితులను అనిశా రెండ్రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను ఈనెల 9న చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకోనున్నారు అధికారులు.

esi case

ఈఎస్‌ఐ కుంభకోణంలో నిందితులను రెండు రోజుల కస్టడీకి అనిశా న్యాయస్థానం అనుమతించింది. ఐదు రోజుల కస్టడీ అడిగినప్పటకీ... 2 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ నెల 9, 10 తేదీల్లో నిందితులను అదుపులోకి తీసుకొని అనిశా అధికారులు విచారించనున్నారు. దేవికారాణితో పాటు మరో ఆరుగురిని కస్టడిలోకి తీసుకోనున్నారు. కుంభకోణంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై అధికారులు ప్రశ్నించనున్నారు.

ఈఎస్ఐ కుంభకోణంలో అనిశా అధికారులు ఇవాళ లైఫ్ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఔషధాల కొనుగోలు కుంభకోణంలో దేవికారాణికి సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. లైఫ్ కేర్ డ్రగ్స్ నుంచి ఔషధాలు ఇవ్వకున్నా ఇచ్చినట్లు పత్రాలు సృష్టించినట్లు తేలింది. బలమైన సాక్ష్యాలు లభించినందున సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.

ఇదీ చూడండి: ఈఎస్​ఐ స్కామ్​లో ఏసీబీ దూకుడు.. ఏడుగురి అరెస్టు

ABOUT THE AUTHOR

...view details