తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం - ఓటుకు నోటు కేసు విచారణ వార్తలు

acb court hearing vote for note case in  hyderabad
ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం

By

Published : Dec 15, 2020, 7:11 PM IST

Updated : Dec 15, 2020, 8:04 PM IST

17:29 December 15

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్రపై విచారణ ప్రారంభం

ఓటుకు నోటు కేసు విచారణ కీలక దశకు చేరింది. నిందితుల్లో ఒకరైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై అ.ని.శా న్యాయస్థానం విచారణ ప్రక్రియ ప్రారంభించింది. సండ్ర వెంకట వీరయ్యపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12తో పాటు.. ఐపీసీ 120బీ రెడ్​విత్ 34 కింద న్యాయస్థానం అభియోగాలను నమోదు చేసింది. సండ్ర వెంకట వీరయ్య డిశ్చార్జ్ పిటిషన్​ను హైకోర్టు కూడా కొట్టివేయటంతో.. విచారణ ప్రక్రియ ప్రారంభించింది. 

అభియోగాలను సండ్ర వెంకట వీరయ్యకు న్యాయాధికారి చదివి వినిపించారు. లంచం ఇచ్చేందుకు ఇతరులతో కలిసి కుట్ర పన్నినట్లు అ.ని.శా అభియోగాల సారాంశమని సండ్రకు కోర్టు తెలిపింది. తనపై అ.ని.శా అభియోగాలన్నీ తప్పని.. తానెలాంటి నేరం చేయలేదని.. విచారణకు సిద్ధమని సండ్ర వెంకట వీరయ్య న్యాయస్థానానికి తెలిపారు. దీంతో తదుపరి విచారణ కోసం కేసును ఈనెల 22కి వాయిదా వేసింది.

సాక్షుల విచారణ షెడ్యూలు త్వరలో ఖరారు కానుంది. ఇతర నిందితులు రేవంత్ రెడ్డి, సెబాస్టియన్ కూడా నేటి విచారణకు హాజరయ్యారు. మరో నిందితుడు ఉదయ్ సింహా గైర్హాజరయ్యారు. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఉదయ్ సింహా తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్​ను కొట్టివేసిన అ.ని.శా న్యాయస్థానం.. నాన్ బెయిలబుల్ వారంట్ చేసింది.

ఇదీ చదవండి: యాజమాన్య కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
 

Last Updated : Dec 15, 2020, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details