తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఓటుకు నోటు కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై ముగిసిన వాదనలు - హైదరాబాద్​ వార్తలు

ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. డిశ్చార్జ్ పిటిషన్లపై తీర్పును ఏసీబీ న్యాయస్థానం నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది.

acb court hearing is over on vote for note case discharge pittion of sandra venkat veeraiah and udayasimha
ఓటుకు నోటు కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై ముగిసిన వాదనలు

By

Published : Oct 28, 2020, 6:39 PM IST

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వీటిపై తీర్పును ఏసీబీ న్యాయస్థానం నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. ఓటుకు నోటుకు కేసులో తమ ప్రమేయం లేకపోయినప్పటికీ.. ఏసీబీ అధికారులు ఇరికించారని సండ్ర, ఉదయ్ సింహా వాదించారు.

కేసు నుంచి తమను తొలగించాలని కోర్టును కోరారు. సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఏసీబీ తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్ రావు వాదించారు. డిశ్చార్జ్ పిటిషన్లను కొట్టివేసి.. అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును నవంబరు 2కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:అ.ని.శాకు చిక్కిన గాంధీనగర్ ఎస్‌ఐ, మరో కానిస్టేబుల్‌

ABOUT THE AUTHOR

...view details