నకిలీ పాసుపుస్తకాల కేసులో అరెస్టైన ధర్మారెడ్డి నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసింది. ఇదే కేసులో ఆయన కుమారుడు శ్రీకాంత్ రెడ్డి కూడా జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి అంత్యక్రియల కోసం శ్రీకాంత్ రెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తండ్రి అంత్యక్రియల కోసం శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ - శ్రీకాంత్ రెడ్డికి బెయిల్
నకిలీ పాసుపుస్తకాల కేసు నిందితుడు ధర్మారెడ్డి అంత్యక్రియల కోసం కుమారుడు శ్రీకాంత్ రెడ్డికి నాంపల్లి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వారంలో రెండు రోజులు ఏసీబీ కార్యాలయానికి రావాలని షరతు విధించింది.
తండ్రి అంత్యక్రియల కోసం శ్రీకాంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్
వారంలో రెండు సార్లు ఏసీబీ కార్యాలయానికి వచ్చి వెళ్లాలనే షరతు విధించింది. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో శ్రీకాంత్ రెడ్డి తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి:కీసర మాజీ తహసీల్దార్ కేసులో మరొకరు ఆత్మహత్య
TAGGED:
శ్రీకాంత్ రెడ్డికి బెయిల్