రాష్ట్ర గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కాడు. సంస్థ విశ్రాంత ఉద్యోగికి... విరమణ ప్రయోజనాలు ఇవ్వడానికి రూ.లక్ష డిమాండ్ చేశాడు. చివరికి రూ.70 వేలకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బులు తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. బాధితుడు బానోతు రనౌత్ 2018లో పదవీ విరమణ చేశాడు. అప్పటికే అతని మీద అనిశా కేసు నమోదయి ఉండడంతో పదవీ విరమణ ప్రయోజనాలు సంస్థ నుంచి లభించలేదు.
అనిశా వలలో గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్ - తెలంగాణ తాజా వార్తలు
14:16 January 20
అనిశా వలలో గిడ్డంగుల సంస్థ జనరల్ మేనేజర్
ఎండీ ఆదేశాల మేరకే..
ప్రయోజనాల కోసం అతను సుధాకర్‌రెడ్డి, ఎండీ భాస్కరాచారిని సంప్రదించాడు. వాళ్లు రూ.లక్ష డిమాండ్ చేశారు. రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా... అనిశా అధికారలు దాడి చేసి పట్టుకున్నారు. విచారణలో జనరల్ మేనేజర్ సుధాకర్‌రెడ్డి మరో విషయం వెల్లడించాడు. సంస్థ ఎండీ భాస్కరాచారి ఆదేశాల మేరకు తాను లంచం స్వీకరించానని తెలిపాడు. అనిశా బృందం భాస్కరాచారిని విచారించి అదుపులోకి తీసుకుంది. వారిద్దరి ఇళ్లు, కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలోనూ వీరు అవినీతికి పాల్పడ్డారా..? ఇదే తరహాలో ఇంకెవరి వద్దయినా లంచం తీసుకున్నారా అనే అంశాల మీద విచారించారు.
అనంతరం ఇరువురిని అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు.. ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఎండీ భాస్కరాచారి, జీఎం సుధాకర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించగా.. చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇవీ చూడండి:ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్ఎస్పై సుప్రీం విచారణ పూర్తయ్యాకే హైకోర్టులో..