జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల పరిధిలో రూ. 5వేలు లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. కుందనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల నిర్మాణ పనులకు సంబంధించి.. నిర్వహణ బాధ్యతలు చేపట్టిన దేశెట్టి ఓదెలును శానిటేషన్ విభాగానికి చెందిన ఏఈ కత్తుల కుమారస్వామి లంచం అడిగాడు.
లంచం తీసుకుంటూ పట్టుబడిన శానిటేషన్ ఉద్యోగి.! - లంచం తీసుకుంటూ పట్టుబడిన శానిటేషన్ ఉద్యోగి
రూ. 5వేలు లంచం తీసుకుంటూ విద్యాశాఖలో శానిటేషన్ విభాగానికి చెందిన ఏఈ.. ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
ఏసీబీ, శానిటేషన్ ఉద్యోగి
ఈ క్రమంలో ఏం చేయాలో తోచక ఓదెలు అతనిని టకుమాట్ల గ్రామానికి రమ్మని చెప్పాడు. ఆ వెంటనే ఏసీబీకి సమాచారం అందించాడు. లంచం తీసుకుంటుండగా అక్కడికి చేరుకున్న అధికారులు.. కుమారస్వామిని పట్టుకున్నారు.
ఇదీ చదవండి:20ఏళ్లుగా చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్