వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అటెండర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అవినీతి బాగోతం బట్టబయలైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన సమ్మయ్య అనే వ్యక్తి మెడికల్ సర్టిఫికెట్ కోసం ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య ధ్రువపత్రంపై సివిల్ సర్జన్‌తో సంతకం పెట్టించేందుకు అటెండర్ శ్రీకాంత్ రూ.1500 డిమాండ్ చేశాడు.
ఏసీబీకి చిక్కిన వరంగల్ ఎంజీఎం అటెండర్ - ఎంజీఎంలో ఏసీబీకి చిక్కిన అటెండర్
ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి అటెండర్ అడ్డంగా దొరికిపోయాడు. మెడికల్ సర్టిఫికెట్‌పై సివిల్ సర్జన్ సంతకం పెట్టించేందుకు రూ.1500 డిమాండ్ చేశాడు.
ఏసీబీకి చిక్కిన వరంగల్ ఎంజీఎం అటెండర్
లంచం ఇవ్వడం ఇష్టంలేని సమ్మయ్య అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం అటెండర్ డబ్బులు తీసుకుంటుండగా అతన్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.