తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్​ అధికారి - కీసర వార్తలు

ఓ విద్యుత్​ అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని విద్యుత్ కార్యాలయంలో జరిగింది. ఈ లంచం కేసుకు సంబంధించి అనిశా అధికారులు మరో ముగ్గురు అధికారులను విచారిస్తున్నారు.

acb catch electricity employees at taking bribe in medchal district
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విద్యుత్​ అధికారి

By

Published : Nov 17, 2020, 4:58 PM IST

మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని వైష్ణవి కన్​స్ట్రక్షన్​లో ట్రాన్స్​ఫార్మర్స్, మీటర్ల కోసం బాధితుడు శశికుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్​ఫార్మర్స్, మీటర్లు మంజూరు కావాలంటే రూ.13 వేలు ఇవ్వాలని సబ్​ ఇంజినీర్​ విజయేందర్​ రెడ్డి బాధితుడికి చెప్పారు. ఈ విషయమై శశికుమార్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు.

రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు విజయేందర్​ రెడ్డి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఒక్కొక్క అధికారికి లక్షల్లో జీతాలు ఉన్నా ఇలా అవినీతికి పాల్పడడం దారుణమని బాధితుడు అన్నారు.

ఇదీ చదవండి:డబ్బులు కావాలని ఫేస్​బుక్​లో ఎస్పీ మెస్సేజ్!

ABOUT THE AUTHOR

...view details