అక్రమాస్తుల కేసులో ఏసీబీ రిమాండ్‌లో ఉన్న మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డిని అనిశా అధికారులు నాలుగోరోజు ప్రశ్నిస్తున్నారు. కస్టడీ ఆఖరు రోజు అవ్వగా నర్సింహారెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నర్సింహారెడ్డి బినామీలను గుర్తించిన అధికారులు.. వాళ్ల పేరు మీద ఉన్న ఆస్తులను గుర్తించే పనిలో పడ్డారు. మాదాపూర్‌కు చెందిన ఓ మహిళ పేరు మీద నర్సింహారెడ్డి ఆస్తులు కొన్నట్లు అనిశా గుర్తించింది. ప్రస్తుతం ఆమె విదేశీ పర్యటనలో ఉండగా.. ఆమె వచ్చాక ఎన్ని ఆస్తులు ఉన్నాయనే వివరాలను సేకరించనున్నారు.
ఆఖరి రోజు కస్టడీకి ఏసీపీ నర్సింహారెడ్డి.. ఏసీబీ ప్రత్యేక దృష్టి - ACB Latest News
ఏసీబీ కస్టడీ ఆఖరు రోజు కాగా మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించేందుకు అనిశా అధికారులు సిద్ధమయ్యారు. గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు ఏసీపీను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఆలోపు చంద్రారెడ్డి అనే కీలక బినామీ పేరు మీద ఉన్న ఆస్తులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఆఖరు రోజు కస్టడీలో కీలక సమాచారం సేకరించేందుకు అనిశా యత్నం
ఇప్పటికే ఎనిమిది మంది బినామీలను అరెస్ట్ చేసి అనిశా అధికారులు రిమాండ్‌కు తరలించారు. చంద్రారెడ్డి అనే కీలక బినామీపేరు మీద ఉన్న ఆస్తులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఐదు గంటలలోపు ఏసీపీను న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. ఆలోపు నర్సింహారెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇవీ చూడండి:బినామీ ఆస్తుల గురించి దాటవేసిన ఏసీపీ నర్సింహారెడ్డి