హైదరాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. చిలకలగూడకు చెందిన మమత అనే యువతి స్థానికంగా ఉన్న ఓ షాపులో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 16న ఇంటి నుంచి దుకాణానికి బయల్దేరిన మమత.. తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడం వల్ల కుటుంబ సభ్యులు సమీప బంధువులు, స్నేహితులను ఆరాతీశారు.
చిలకలగూడలో యువతి అదృశ్యం.. కేసు నమోదు - చిలకలగూడలో యువతి అదృశ్యం వార్తలు
చిలకడగూడ ఠాణా పరిధిలో ఓ యువతి అదృశ్యమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చిలకలగూడలో యువతి అదృశ్యం.. కేసు నమోదు
ఎలాంటి ప్రయోజనం లేకపోవడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.