తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అదృశ్యమైందనుకున్నారు.. తిరిగొస్తే షాకయ్యారు..! - యువతి అదృశ్యం

ఇంట్లో ఉండటం తనకు ఇష్టం లేదంటూ.. లెటర్ రాసి పెట్టి ఓ యువతి అదృశ్యమైంది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్యమైన యువతి తిరిగి రావడంతో వారంతా షాక్​కు గురయ్యారు. ఇంతకీ ఏం జరిగింది..?

A young woman who wanted to disappear .. Family members were shocked when she returned home
అదృశ్యమైందనుకున్నారు.. తిరిగొస్తే షాకయ్యారు..!

By

Published : Feb 5, 2021, 7:57 PM IST

అదృశ్యమైందనుకున్న ఓ యువతి.. వివాహం చేసుకొని తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు షాక్​కు గురయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్, తిరుమలగిరి పోలీస్​స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

స్థానిక సాయిబాబా కాలనీలో నివాసముంటున్న మంజు అనే యువతి.. టీచర్స్ కాలనీలోని ఓ పాఠశాలలో రిసెప్షనిస్ట్​గా పని చేస్తుంది. నిన్న ఉదయం విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన ఆమె.. తనకు ఇంట్లో ఉండటం ఇష్టం లేదంటూ ప్రిన్సిపల్​కు ఓ లెటర్ రాసి ఇచ్చి అదృశ్యమైపోయింది.

ప్రిన్సిపల్ నుంచి సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు.. ఆందోళన చెందారు. బంధువులను, స్నేహితులను ఆరా తీసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. కట్​ చేస్తే.. అదృశ్యమైన ఆ యువతి, ఓ వ్యక్తిని వివాహమాడి ఇంటికి తిరిగొచ్చింది. షాక్​కు గురవ్వటం కుటుంబ సభ్యుల వంతైంది.

ఇదీ చదవండి:యువకుల కర్కశం... గిరిజన మహిళపై అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details