ఇంట్లో నుంచి అదృశ్యమైన కీర్తి ప్రజ్ఞ అనే యువతి తిరుపతిలో వివాహం చేసుకున్న సంఘటన సికింద్రాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లాలాపేట ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి స్టేషనరీ షాప్ నడపడంతో పాటు యోగా శిక్షకుడు. శ్రీధర్ కుమార్తె కీర్తి ప్రజ్ఞ స్థానికంగా ఉండే కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది.
శిక్షణలో పరిచయమైన వ్యక్తితోనే..
ఇటీవల శ్రీధర్ కుటుంబం యోగ శిక్షణ నిమిత్తం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ ప్రాంతానికి వెళ్లింది. యోగా శిక్షణ నేర్చుకుంటున్న క్రమంలో.. కీర్తి ప్రజ్ఞకు అదే యోగా క్యాంప్‌లో తిరుపతికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ప్రభాకర్‌ని పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.