తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పెళ్లి కాలేదని యువతి ఆత్మహత్య - తుకారం గేట్​లో యువతి ఆత్మహత్య

పెళ్లి కావటం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ తుకారం గేట్​ పీఎస్​ పరిధిలో చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా ఆమెకు పెళ్లి సంబంధాలు వస్తున్నా ఏ ఒక్కటీ కుదరకపోవటంతో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

young woman suicide, thukaram
యువతి ఆత్మహత్య, తుకారం

By

Published : Jan 17, 2021, 6:59 AM IST

వివాహం కావటం లేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్​లోని తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తుకారం గేట్ లోయ నగర్​లో నివాసం ఉంటున్న అనిత(36)కు గత కొన్నేళ్లుగా తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎన్ని సంబంధాలు వస్తున్నా ఏ ఒక్కటీ కుదరకపోవటంతో అనిత తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

పెళ్లి కావటం లేదనే ఆందోళనతోనే యువతి తనువు చాలించినట్లు పోలీసులు వివరించారు. ఇటీవల ఆమె సోదరి కూడా అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. అనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:అలా చూసి.. ఇలా ఎత్తుకెళ్తారు.. ఆఖరికి చిక్కారు

ABOUT THE AUTHOR

...view details