సెల్ఫీ చిత్రాల పిచ్చి మరో యువకుని ప్రాణాలను బలితీసుకుంది. మహబూబ్నగర్ జిల్లాలో దుందుభి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సమయంలో లింగంపేట గ్రామ సమీపంలోని చెక్ డ్యాం వద్ద అఫ్రోజ్ అనే యువకుడు సెల్ఫీ తీసుకునే క్రమంలో గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక చెట్టు ఆగిన చోట యువకుని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసి జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.
సెల్ఫీ కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు... - సెల్ఫీ కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు చేరాడు
సరదాగా ఈతకొట్టి సెల్ఫీ చిత్రాలు దిగుతున్న సమయంలో నీటి ప్రవాహంలో గల్లంతైన యువకుడి మృతదేహాన్ని ప్రత్యేక బృందాలు గాలించి వెలికితీశాయి. గల్లంతైన ప్రదేశం నుంచి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం లింగంపేట గ్రామ సమీపంలో వెలుగులోకి వచ్చింది.
సెల్ఫీ కోసం వెళ్లి తిరిగి రాని లోకాలకు చేరాడు
శనివారం రాత్రి చీకటి కావడం వల్ల మృతదేహం లభించలేదని.. కానీ తెల్లవారుజామున చేసిన ప్రయత్నాలు ఫలించడం వల్ల అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. సీఐ వీరస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాగు పరిసర ప్రాంతాల్లో ఈతకు వెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరించారు.
ఇదీ చూడండి :ఏపీలో రేపటి నుంచి తెరచుకోనున్న పాఠశాలలు