ఈతకు వెళ్లిన నలుగురు యువకుల్లో ఒకరు మునిగి మృతిచెందగా.. మరొకరికి మూర్ఛరావడంతో రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో జరిగింది. గ్రామంలో ఉన్న వీరన్న చెరువులో స్థానిక పరిశ్రమల్లో పనిచేసే నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఈత కొడుతుండగా అభిలాష్ అనే యువకుడికి మూర్ఛ వచ్చింది. ఇతన్ని రక్షించేందుకు మిగతా ముగ్గురు ప్రయత్నించారు. అభిలాష్‌ను తీసుకుని ఇద్దరు ఒడ్డుకు చేరుకున్నారు. జగన్ మాత్రం నీటిలో మునిగిపోయాడు.
మిత్రుడిని రక్షించబోయి.. నీట మునిగిన యువకుడు
ఆ నలుగురు ఈతకు వెళ్లారు. సరదాగా ఈత కొడుతుండగా ఒకరికి మూర్ఛ వచ్చింది. వెంటనే మిగతా ముగ్గురు రక్షించేందుకు ప్రయత్నించారు. అతణ్ని బయటకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఇంకొకరు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
మిత్రుడిని రక్షించబోయి.. నీట మునిగిన యువకుడు
తనకోసం గాలించినా ఎక్కడా కనిపించలేదు. అభిలాష్‌ను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. జగన్ కోసం గజ ఈతగాళ్లను పిలిపించి వీరన్న చెరువులో పోలీసులు వెతికిస్తున్నారు. చెరువు వద్ద జగన్ బంధువులు రోధనలు మిన్నంటాయి.
ఇదీ చూడండి:ప్రాజెక్టును చూసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం