తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

జంపన్న వాగులో యువకుడు గల్లంతు - ములుగు నేర వార్తలు

జంపన్న వాగులో స్నానానికి దిగిన యువకుడు గల్లంతయ్యాడు. మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వచ్చిన... హైదరాబాద్​ గాయత్రి నగర్​కు చెందిన భాను.. వాగులో స్నానానికి దిగి నీట మునిగాడు.

జంపన్న వాగులో యువకుడు గల్లంతు
జంపన్న వాగులో యువకుడు గల్లంతు

By

Published : Nov 8, 2020, 9:28 PM IST

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని జంపన్న వాగులో యువకుడు గల్లంతయ్యాడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి కుటుంబంతో వచ్చిన యువకుడు స్నానం కోసం వాగులో దిగి నీట మునిగాడు.

హైదరాబాద్​లోని గాయత్రి నగర్​కు చెందిన భానుకు పదిరోజుల కిందట వివాహమైంది. కుటుంబంతో సహా సమ్మక్క సారలమ్మల దర్శనానికి వచ్చాడు. స్నానం చేద్దామని జంపన్నవాగులో దిగాడు. వాగులోని చెక్​డ్యాం వద్ద నీట మునిగి గల్లంతయ్యాడు. యువకుడి కోసం కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details