తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

లారీని బైక్​తో ఢీకొట్టి యువకుడు మృతి - బైక్​తో లారీని ఢీ కొట్టిన యువకుడు

కాసేపటికి ఇల్లు చేరుకుంటాననే సమయంలో.. ముందు వెళ్తున్న లారీని బైక్​పై వెళ్తున్న యువకుడు ఢీకొట్టాడు. ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

a-young-man-was-died-collided-with-a-truck-at-devarakadra-mahabubnagar
లారీని బైక్​తో ఢీకొట్టి యువకుడు మృతి

By

Published : Dec 5, 2020, 10:55 AM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. దేవరకద్రకు చెందిన హరీశ్​(24) బంధువుల శుభకార్యం కోసం వివిధ పనులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తున్నాడు.

అదే సందర్భంలో ముందు వెళ్తున్న లారీని ఆకస్మాత్తుగా ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్రగాయాలైన యువకుడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చేతికొచ్చిన కుమారుడు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల.. యువకుడి తల్లిదండ్రుల రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.

ఇదీ చూడండి :గుత్తేదారుల నిర్లక్ష్యం... కూలిన బతుకులు

ABOUT THE AUTHOR

...view details