తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి - తెలంగాణ నేర వార్తలు

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన నాగర్​ కర్నూల్​ జిల్లా కేంద్రం నల్లవెల్లిరోడ్డులో జరిగింది. మృతుడు నగరంలోని శ్రీనగర్​ కాలనీకి చెందిన వినయ్​గా గుర్తించారు.

నల్లవెల్లిరోడ్డులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
నల్లవెల్లిరోడ్డులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

By

Published : Feb 2, 2021, 10:45 AM IST

నాగర్​కర్నూల్ జిల్లా కేంద్రం నల్లవెల్లి రోడ్డులోని మిషన్ కాంపౌండ్ సమీపంలో విషాదం జరిగింది. శ్రీనగర్​ కాలనీకి చెందిన వినయ్(23) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇటీవలే బీటెక్​ పూర్తి చేసిన తమ కుమారుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... మృతుడు శ్రీనగర్​ కాలనీకి చెందిన వినయ్​గా గుర్తించారు. మృతదేహం సమీపంలో ద్విచక్రవాహనం, పర్సు లభించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడిది హత్య..?, ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:డీసీఎంను ఢీకొట్టిన బైక్​.. చెలరేగిన మంటలు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details