ఏపీలోని కడప జిల్లా రాయచోటి ప్రధాన రహదారి టోల్గేట్ వద్ద పనిచేస్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కారణంతో... అదే మండలానికి చెందిన దామోదర్ యాదవ్పై పోలీసులు చేయిచేసుకున్నారు. ఏఎస్ఐ లాఠీతో కొట్టడంతో దెబ్బలు తాళలేక ఠాణా ఎదుట ఉన్న జాతీయ రహదారిపైకి పరుగులు తీశాడు. తనను కొట్టవద్దని బతిమాలుతూ కన్నీటి పర్యంతమయ్యాడు.
లాఠీ దెబ్బలు తాళలేక రోడ్డుపై పరిగెత్తాడు... - రాయచోటి నేరవార్తలు
విచారణలో భాగంగా పోలీసులు కొట్టిన లాఠీదెబ్బలు తాళలేక ఓ వ్యక్తి రహదారిపై పరుగులు తీశాడు. తనను కొట్టవద్దని బతిమాలుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను చూసేందుకు జనాలు గుమిగూడారు. కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయటంతో ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి.
లాఠీ దెబ్బలు తాళలేక రోడ్డుపై పరిగెత్తాడు...
బహిరంగ ప్రదేశంలో జరుగుతున్న ఈ ఘటనను చూసేందుకు జనం ఎగబడ్డారు. కొందరు ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మరో వైపు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోనే స్టేషన్కు పిలిపించామని, అప్పటికే దామోదర్ మద్యం సేవించాడని పోలీసుల తెలిపారు.