ఒక బస్సుకు బదులు మరో బస్సు ఎక్కిన యువకుడు వేగంగా నడుస్తున్న బస్సులోంచి దూకేశాడు. ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన దేవా పెద్దపల్లిలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం వరకు పనిచేసి బస్టాండుకు వచ్చాడు. డిపోలో ఒక్కడే ఉండడం వల్ల భాష తెలియకపోవడం చేత గోదావరిఖని వెళ్లాల్సిన బస్సుకు బదులు మంథని వెళ్తున్న బస్సు ఎక్కేశాడు. టిక్కెట్టు తీసుకునే సమయంలో తాను వేరే ఊరు బస్సు ఎక్కానని తెలుసుకుని నడుస్తున్న బస్సు నుంచి దూకేశాడు.
వేగంగా నడుస్తున్న బస్సు నుంచి దూకేసిన యువకుడు - పెద్దపల్లి వార్తలు
వేగంగా నడుస్తున్న ఆర్టీసీ బస్సు నుంచి దూకిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గాయపడిన యువకుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కదులుతున్న ఆర్టీసీ బస్సు నుంచి దూకేసిన యువకుడు
గాయపడిన యువకుడిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురి ప్రాణాలు నిలిచేవి