పర్యటక ప్రాంతమైన సూర్యలంక తీరంలో విషాదం చోటు చేసుకుంది. కొవిడ్ కారణంగా ఆరు నెలలుగా పర్యటకులను అనుమతించటం లేదు. అయినా కొందరు సూర్యలంక తీరానికి వచ్చి వెళుతున్నారు.
విహారయాత్రలో విషాదం... బీచ్లో యువకుడు గల్లంతు - suryalanka beach news
సరదాగా స్నేహితులంతా కలిసి సముద్ర తీరంలో విహారానికి వెళ్లారు. స్నానం చేయటానికి నీళ్లలోకి దిగారు. ఇంతలోనే అలల తాకిడికి వారిలో ఇద్దరు గల్లంతయ్యారు. అందులో ఒకరిని స్థానికులు కాపాడగా...మరొకరి ఆచూకీ దొరకలేదు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని బాపట్ల సూర్యలంకతీరంలో జరిగింది.
విహారయాత్రలో విషాదం... బీచ్లో యువకుడు గల్లంతు
ఆదివారం సెలవు దినం కావడంతో ఆంధ్రప్రదేశ్ గుంటూరు సంగడిగుంటకు చెందిన 11 మంది యువకులు తెల్లవారుజామున ద్విచక్రవాహనాలపై బయలుదేరి బాపట్ల సూర్యలంక తీరానికి వెళ్లారు. వీరంతా తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారు. స్థానిక జాలర్లు ఒకరిని కాపాడి వైద్యశాలకు తరలించారు. మరొకరి ఆచూకీ లభ్యం కాకపోవడంతో తోటి స్నేహితులు ఆందోళనలో ఉన్నారు.