సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం అయినాపూర్ శివారులోని తపాస్పల్లి రిజర్వాయర్లో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన గోజల సతీశ్ రెడ్డి... హైదరాబాద్లో తన అన్నా వదినల దగ్గరే ఉంటూ జీవనోపాధి కోసం పనులు చేస్తూ ఉండేవాడు. కరోనా నేపథ్యంలో నగరంలో పనులు లేకపోవడం వల్ల మూడు నెలల కిందటే సంగుపల్లిలో ఉంటున్న తల్లి పెంటమ్మ వద్దకు వచ్చాడు.
తపాస్పల్లి రిజర్వాయర్లో యువకుడు అనుమానాస్పద మృతి - crime news
కాళ్లు కట్టేసుకుని ఉన్న ఓ యువకుని మృతదేహం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లో ప్రత్యక్షమైంది. అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుడు గజ్వేల్ మండలం సంగుపల్లికి చెందినవాడిగా స్థానికులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
a young man died in suspicious manner in tapoaspally reservoir
ఆదివారం రోజు ఓ ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి వెళ్లాడు. సాయంత్రం తపాసుపల్లి రిజర్వాయర్ మత్తడిలో అనుమానాస్పదంగా మృతి చెంది కన్పించాడు. అయితే మృతుని కాళ్లు రెండు తాడుతో కట్టేసి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ యువకుడే కాళ్లు కట్టేసుకుని రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సతీశ్ మృతిపై కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.