తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి - a young man died in suspicious condition on palivelpula ring

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్​రోడ్డులోని పలివేల్పుల రింగ్​రోడ్డుపై ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

a young man died in suspicious condition on palivelpula ring road in hanmakonda
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

By

Published : May 10, 2020, 1:47 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాకతీయ యూనివర్సిటీ క్రాస్​రోడ్డులోని పలివేల్పుల రింగ్​రోడ్డుపై తెల్లవారుజామున తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతుడు పెగడపల్లికి చెందిన బొల్లం రమేశ్​గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచూడండి: విషాదం : గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details