కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరా నగర్ స్టేజ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
బోలేరో ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి - ద్విచక్ర వాహనదారుడు మృతి
ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటుతున్న యువకుడిని ఓ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో.. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వాహనం ఢీకొని.. ద్విచక్ర వాహనదారుడు మృతి!
మల్లాపూర్‌కు చెందిన వెంకటేష్(25) ద్విచక్ర వాహనంతో రోడ్డు దాటే క్రమంలో కరీంనగర్ వైపు వెళ్తున్న బోలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ద్విచక్రవాహనం, లారీ ఢీ.. వ్యక్తి మృతి