జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి నాలుగంతస్తుల మేడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మానసిక ఒత్తిడికి గురై యువతి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మెదట విద్యుత్ తీగకు తగిలి.. రేకుల పై నుంచి.. కింద ఉన్న ఆటోలో పడడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడింది.
నాలుగంతస్తుల మేడపై నుంచి దూకిన యువతి - జనగామ నేర వార్తలు
మతి స్థిమితం లేని ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన యువతి నాలుగంస్తుల మేడపై నుంచి దూకింది. స్వల్పగాయాలపాలైన ఆమెను ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
నాలుగంతస్తుల మేడపై నుంచి దూకిన యువతి.. కానీ..
ఆమెను జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని రోజులుగా మతిస్థిమితం సరిగా లేనట్లు ప్రవర్తిస్తోందని.. అందుకు మందులు కూడా వాడుతున్నామని కుటుంబ సభ్యులు తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Jan 12, 2021, 5:21 PM IST