కరీంనగర్‌లోని కోతిరాంపూర్‌కు చెందిన మహేశ్(22) ఆన్లైన్ గేమ్‌కు ఆకర్షితుడయ్యాడు. ఉన్నచోటే డబ్బులు సంపాదించాలనే అతివిశ్వాసంతో గేమ్‌ను ప్రారంభించాడు. చివరకు ఉన్న డబ్బులు పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయి తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్ - online games latest news
సరదాగా మొదలెట్టిన ఆన్లైన్ గేమ్ యువకుడి ప్రాణాలు తీసింది. ఆర్థికంగా దెబ్బతీసి ఆత్మహత్య చేసుకునేలా చేసింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాదకర ఘటన కరీంనగర్లో జరిగింది.
![యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్ A young boy committed suicide in karimnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8760599-274-8760599-1599806534768.jpg)
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. ఆన్లైన్ గేమ్‌లతో యువత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి:కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..