మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని లక్ష్మీ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడి గోపాల్ అనే కూలీ మృతి చెందాడు.
విషాదం: ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా కిందపడి కూలీ మృతి - మహబూబ్నగర్ జిల్లా నేర వార్తలు
ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ కూలీ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
![విషాదం: ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా కిందపడి కూలీ మృతి A worker dies while doing roof work](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8620553-873-8620553-1598834722022.jpg)
విషాదం: ఇంటి పైకప్పు పనులు చేస్తుండగా కిందపడి కూలీ మృతి
స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడు నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం రాళ్ల చెరువు తండాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై షంషుద్దీన్ తెలిపారు.