మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పట్టణ శివారులోని పుష్పాలవాగు పక్కన బారకమాన్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు హవేలి ఘనాపూర్‌తండాకు చెందిన రమ్మీ(45)గా గుర్తించారు. ఆ మహిళ కూలీపనికి వెళ్లి జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి - మెదక్ జిల్లా తాజా సమాచారం
మెదక్ పట్టణ శివారులో అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతురాలు హవేలి ఘనాపూర్‌తండాకు చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మెదక్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
మృతురాలికి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా... భర్త మూడేళ్ల క్రితమే మరణించినట్లు వెల్లడైంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటయ్య పేర్కొన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.