మహబూబ్నగర్ గ్రామీణ మండలం తువ్వగడ్డ తండా చిక్కుడు వాగులో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వంతెన కింద వాగులో చెక్ డ్యాం నీళ్లల్లో మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి - తువ్వగడ్డ తండా
వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![వాగులో మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి a women suspected death in mahabubnagar district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9372800-304-9372800-1604077113202.jpg)
వాగులో పడి మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రి మార్చురికి తరలించారు. మృతురాలి వివరాలు తెలియ రాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అనితను రిమాండ్కు తరలించిన పోలీసులు