జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలికలో ఓ మహిళ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానిక టీచర్స్ కాలనీలో ఉండే లిల్లీ(23) అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.
ఐజ పురపాలికలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి - జోగులాంబ గద్వాల జిల్లా నేర వార్తలు
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలికలో ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమె మృతిపై పలు అనుమానాలు వక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
![ఐజ పురపాలికలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి A women suicide in suspected stage in jogulamba gadwal dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9552090-329-9552090-1605445982533.jpg)
ఐజ పురపాలికలో అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి
ఐజ మండలం భూమ్‌పురం గ్రామానికి చెందిన వికాస్, ఖమ్మం జిల్లాకేంద్రానికి చెందిన లిల్లీ హైదరాబాద్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. లాక్డౌన్ నుంటి ఐజలోని టీటర్స్ కాలనీలో నివాసముంటున్నారు. మృతురాలు ఆరునెలల గర్భీణీగా పోలీసులు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.