ఒడిశాలోని కొరాపుట్ జిల్లా ఎస్పీ వద్ద మహిళా మావోయిస్టు రామి మడకమి లొంగిపోయింది. ఈమె మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షణ విభాగంలో సభ్యురాలని కొరాపుట్ ఎస్పీ ముకేష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. రామి మడకమి పలు ఎదురు కాల్పుల ఘటనలో పాల్గొన్నట్లు ఎస్పీ తెలిపారు.
ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళ మావోయిస్టు సభ్యురాలు - Andhra- Odisha boarder news
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అంగరక్షణ విభాగంలో సభ్యురాలు రామి మడకమి ఒడిశాలోని కొరాపుట్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈమెపై నాలుగు లక్షల రివార్డు ఉందని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
ఒడిశా పోలీసుల ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టు సభ్యురాలు
2013లో మావోయిస్టు పార్టీలో చేరిన రామి మడకమి... మొదట జన నాట్య మండలిలో పాటలు పాడేదని అనంతరం ఏసీఎం స్థాయికి ఎదిగిందని ఎస్పీ తెలిపారు. ఈమెపై నాలుగు లక్షల రివార్డు కూడా ఉందని వివరించారు. లొంగిపోయినందున ఆమె సాధారణ జీవితం గడిపేందుకు సహాయం అందిస్తామని చెప్పారు. ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల వద్ద ఒడిశా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోందని ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:ఎమ్మెల్యే గణేశ్ గుప్తాను పరామర్శించిన సీఎం కేసీఆర్