సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ దుర్మరణం పాలయ్యింది. ఇస్నాపూర్ శివారులో హిండ్వేర్ పరిశ్రమలో పని చేస్తున్న స్వాతి అనే హౌస్ కీపింగ్ కార్మికురాలు ఉదయం పూట విధులకు వెళ్తోంది.
రోడ్డు దాటుతుండగా ప్రమాదం... యువతి అక్కడికక్కడే మృతి - రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
పండగ రోజే ఆ యువతికి చివరి రోజైంది. రోడ్డు దాటే క్రమంలో వచ్చిన ఆ వాహనమే ఆమె పాలిట మృత్యుపాశమైంది. విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన ఆమెను ఓ గుర్తు తెలియని వాహనం అనంతలోకాలకు చేర్చింది.
a women died in road accident at isnapur
ఈ క్రమంలో జాతీయ రహదారి దాటుతున్న స్వాతిని... సంగారెడ్డి నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వాతి... అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.