నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బూత్పూర్ గ్రామానికి చెందిన నరసమ్మ అనే వివాహిత కుటుంబ కలహాలతో రిజర్వాయర్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన హరిజన్ నరసింహులు.. ఏడాది క్రితం నరసమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నరసమ్మకు గత కొన్ని నెలలుగా అత్తమామల వేధింపులు మొదలయ్యాయి.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య - etv bharat
కుటుంబ కలహాలతో ఓ వివాహిత రిజర్వాయర్లో దూకి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన నారాయణపేట జిల్లా మక్తల్ మండలం బూత్పూర్లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
సోమవారం రాత్రి గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన నరసమ్మ రిజర్వాయర్లోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాత్రంతా కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభించలేదు. మంగళవారం గాలింపు చర్యల్లో భాగంగా నర్సమ్మ మృతదేహం లభ్యమైంది. అత్త మామ, భర్త వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:వివాహేతర సంబంధం తెలిసిపోయిందని భర్తను చంపేసిన భార్య!