మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం రామంతాపూర్తండాకు చెందిన విజయ(22)ను చేగుంట మండలం చెట్ల తిమ్మయ్య పల్లితండాకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. విజయ రైలులో రోజు మేడ్చల్‌కు కూలీ పని కోసం వస్తుంది. శనివారం ఇంటి నుంచి మేడ్చల్‌కు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లకపోటంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్‌లో వివాహిత దారుణ హత్య - మహిళ హత్య
వివాహితను దారుణంగా హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
మేడ్చల్‌లో వివాహిత దారుణ హత్య
విజయను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మేడ్చల్ రైల్వే స్టేషన్ గోడ పక్కన పడేశారు. సోమవారం ఉదయం రైల్వే స్టేషన్ గోడ పక్కన ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు వెంటనే పోలీసులకు సమాచామివ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని విజయగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:పంట మునిగింది.. ప్రాణం పోయింది..