కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శరణ్య(25) బెంగళూరులో ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది. కామారెడ్డి నుంచి హుటాహుటిన తల్లిదండ్రులు బయలుదేరారు. భర్త రోహిత్ చంపి ఉంటాడని... అతని వేధింపులు భరించలేక కూతురు ఉరేసుకుని చనిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న శరణ్య, రోహిత్... పెళ్లైన కొన్నాళ్లకే తన కూతురిని వేధించేవాడని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదంగా వివాహిత మృతి.. ఆత్మ'హత్య'నా? - A woman has died under suspicious circumstances in Bangalore
ప్రేమించింది... పెళ్లాడింది.. భర్తతో కలిసి బెంగుళూరులో ఉంటుంది. అంత బాగానే ఉందనుకుంటే.. ఆకస్మాత్తుగా ఇవాళ అనుమానాస్పదంగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందింది. ఇది ఆత్మహత్యనా.. ? లేదా హత్యనా? అని పోలీసులు విచారిస్తున్నారు.

అనుమానాస్పదంగా వివాహిత మృతి.. ఆత్మ'హత్య'నా?