ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడి ఓ వద్ధురాలు మృతి చెందిన ఘటన సరూర్‌నగర్‌లో చోటు చేసుకుంది. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న కోదండరాం నగర్లో శారదా నగర్‌కి చెందిన సరోజ (80) ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్‌కు వెళ్లారు. ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు.
ఉదయపు నడకకు వెళ్లి నాలాలో పడి వృద్ధురాలి మృతి - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
సరూర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉదయపు నడకకు వెళ్లిన ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు.
![ఉదయపు నడకకు వెళ్లి నాలాలో పడి వృద్ధురాలి మృతి a woman fell into nala and died at sarurnagar in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9410446-198-9410446-1604377547493.jpg)
ఉదయపు నడకకు వెళ్లి... మహిళ మృతి
స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని... డీఆర్ఎఫ్ టీమ్, పోలీసులను, జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టగా... చైతన్యపురిలోని హనుమాన్ నగర్ నాలాలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని వెలికితీసి పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఉదయపు నడకకు వెళ్లి నాలలో పడి వృద్ధురాలి మృతి
ఇదీ చదవండి:దారుణం: పింఛన్ డబ్బు కోసం భార్యను హత్య చేసిన భర్త
Last Updated : Nov 3, 2020, 10:48 AM IST