నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరులో భాగ్యలక్ష్మీ (28) అనే మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. ఇంట్లో పనిచేస్తున్న క్రమంలో అనుకోకుండా విద్యుత్ వైరును పట్టుకోగా.. షాక్ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కరెంట్ తీగకు చేయి తగిలి.. విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన శాలిగౌరారం మండలంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
రోజూ మాదిరిగానే వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన భాగ్యలక్ష్మీ.. వంట సామగ్రిని సరిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతురాలికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.
ఇదీ చదవండి:ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్య... కారణం అదేనా!