తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి - mahabubabad district crime news

దసరా పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నెలకొంది. నీళ్ల మోటార్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై యువతి మృతి చెందింది. అప్పటి వరకు తమ కళ్ల ముందే ఉన్న కూతరు.. ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

a woman died of current shock in mahabubabad district
పండుగ పూట విషాదం: విద్యుదాఘాతంతో యువతి మృతి

By

Published : Oct 25, 2020, 5:30 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రం బెస్త బజారులో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో నీళ్ల మోటర్ వేస్తుండగా.. శ్రీలేఖ అనే యువతి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. గుర్తించిన కుటుంబ సభ్యులు శ్రీలేఖను వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు యువతి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

విషయం తెలుసుకున్న బంధుమిత్రులు, కాలనీ వాసులు ఘటనా స్థలానికి చేరుకొని.. కన్నీరు మున్నీరుగా విలపించారు. శ్రీలేఖ హైదరాబాద్​లోని శ్రీ హిందూ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది.

ఇదీ చూడండి.. నువ్వే లేని లోకానా... నేనుండ లేను

ABOUT THE AUTHOR

...view details