హైదరాబాద్ లాలాగూడాలో సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆఖరు నిమిషంలో చూసిన చిన్నారులు తల్లిని కాపాడేయత్నం చేశారు. కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... ఆ పిల్లలు కాపాడలేకపోయారు. ఇంటికి కొద్ది దూరంలోని దుకాణంలో ఉన్న తండ్రికి ఫోన్ చేసినా ప్రయోజనం లేకపోయింది. తండ్రి వచ్చేలోగా తల్లి మృతిచెందింది.
సెల్ఫీ వీడియో తీసుకుని గృహిణి ఆత్మహత్య - లాలాపేట ఉరివేసుకున్న మహిళ
కళ్ల ముందే తల్లి ఉరివేసుకుంది. పిల్లలు... తమ తల్లి కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఆమె ప్రాణాలు విడిచింది. కళ్ల ముందే తల్లి చనిపోతున్నా... కాపాడుకోలేకపోయిన ఆ పిల్లల బాధ వర్ణాణాతీతం. వారి రోదనలు ఆపతరం ఎవరి వల్ల కాలేదు. ఈ ఘటన హైదరాబాద్ లాలాగూడ పరిధిలో చోటుచేసుకుంది.
కర్ణాటకకు చెందిన సతీశ్, మంజుల లాలాగూడా పరిధిలోని లాలాపేట్‌లో నివాసముంటున్నారు. మంజులకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు కుమారులు కాగా వారు ఐదు, ఆరో తరగతి చదువుతున్న తేజస్, రంజిత్. అమ్మా... అమ్మా అంటూ ఆ పిల్లల రోదనలు... స్థానికులను కంటతడి పెట్టించాయి. మంజుల భర్త... లాలాపేట్ ప్రధాన రహదారిపై అయ్యంగార్ బేకరి నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.