బీమా సొమ్ముకు ఆశపడి తాగుడుకు బానిసైన భర్తను కుటుంబ సభ్యులతో కలిసి కిరాతకంగా అంతమొందించిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండలంలో జరిగింది. ఈనెల 19న జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఘటన జరిగిన 12 గంటల్లోనే కేసును ఛేదించారు.
బీమా సొమ్ము కోసం భర్తను చంపిన ఇల్లాలు - పర్వతగిరి హత్య కేసును ఛేదించిన పోలీసులు
భర్త తాగుడుతో విసుగు చెందింది. చంపితే భర్త పీడ పోతుంది.. ఆయనకున్న బీమా డబ్బులు వస్తాయని ఆలోచించింది. ఇంకేముంది.. అన్న, వదినతో ప్లాన్ చేసింది. అంతా బాగానే చేసినా.. చివర్లో పోలీసులకు చిక్కక తప్పలేదు. బీమా సొమ్ము కోసం భర్తనే హత్య చేసేంత ఘటన నగరంలో జరగలేదు.. ఓ మారుమూల గ్రామంలో జరిగిన ఈ హత్య అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
హత్యా తండాకు చెందిన వీరన్న తాగుడుకు బానిసయ్యాడని... ఆయన భార్య యాకమ్మ తన అన్నా వదినలతో కలసి వీరన్నను హత్యచేసిట్లు పోలీసులు తెలిపారు. స్థానిక సహకార బ్యాంక్లో 20 లక్షల రూపాయలకు భర్త పేరుపై ఇన్సూరెన్స్ చేయించారని... అతడు చనిపోతే ఇన్సూరెన్స్ సొమ్మును తీసుకోవచ్చనే ఉద్దేశంతోనే భర్తను హత్య చేసిందని వివరించారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు.
ఇదీ చూడండి: విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి