తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

'ఉద్యోగం పేరిట అమ్మేశారు.. స్వదేశానికి చేర్చండి'

గల్ఫ్​లో ఉద్యోగం పేరిట అమాయక మహిళలకు ఎర వేసి విదేశీయులకు అమ్ముకుంటున్న ఘటనలు నగరంలో పెరిగిపోతున్నాయి. తాజాగా పాతబస్తీలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. దుబాయ్​లోని ఓ ఆస్పత్రిలో నర్స్​ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ మహిళ.. సూడాన్​ దేశస్థుడికి అమ్మేసింది. తప్పించుకున్న బాధితురాలు తనను భారత్​కు రప్పించాలని ఇండియన్​ ఎంబసీకి వేడుకుంటోంది.

indian embasy, dubai, external affairs
భారత రాయబారి కార్యాలయం, దుబాయ్​లో ఉద్యోగాలు, మోసాల బారిన మహిళలు

By

Published : Jan 6, 2021, 1:26 PM IST

హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయన్​గుట్ట పీఎస్​ పరిధిలోని బండ్లగూడకు చెందిన యువతి.. శంషీర్​గంజ్​లోని ఓ ఆస్పత్రిలో నర్స్​గా విధులు నిర్వహిస్తూ ఉండేది. అక్కడ ఆమెకు వట్టేపల్లికి చెందిన ఫాతిమా అనే ఏజెంట్​తో పరిచయం ఏర్పడింది. యువతిని ఏజెంట్ ఫాతిమా దుబాయ్​లోని ఓ ఆస్పత్రిలో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ డిసెంబర్ 15న అక్కడికి తీసుకెళ్లింది. అనంతరం సూడాన్ దేశస్థుడికి రూ. 2 లక్షలకు అమ్మింది.

విదేశీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ

ఈ క్రమంలో అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు.. భారత రాయబార కార్యాలయానికి చేరుకుంది. అతను తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, ఆరోగ్యం క్షీణించి అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నానని బాధితురాలు వెల్లడించింది. ఎంబసీ అధికారులు తనను భారత్​కు పంపడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయింది. తనను స్వదేశానికి చేర్చాలని చరవాణిలో వీడియో రికార్డులో వేడుకుంది. బాధితురాలి తల్లి.. ఎంబీటీ నేత అంజదుల్లహ్ ఖాన్ ఖలేద్ సహాయంతో భారత్​లోని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం జయశంకర్​కు లేఖ పంపించారు. తన కూతురును ఇండియాకు రప్పించాలని వేడుకున్నారు.

ఇదీ చదవండి:ఎవరు లేనిది చూశారు.. ఎనిమిది ఇళ్లను దోచారు!

ABOUT THE AUTHOR

...view details