తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలు - రోడ్డు ప్రమాదం వార్తలు అరూర్​

యాదాద్రి జిల్లా అరూర్​ గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్​పై నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిందపడ్డారు. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. ఇది చూసిన స్థానికులు 108కి సమాచారం అందించి.. ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలు
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలు

By

Published : Nov 17, 2020, 10:50 PM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్​పై నుంచి కింద పడి ప్రభుత్వ ఉపాధ్యాయుడికి తీవ్రగాయాలైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. గోల్నేపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సింగపాక లింగయ్య తుర్కపల్లి గ్రామంలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

తుర్కపల్లి గ్రామానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ దారి గుండా ప్రయాణిస్తున్న వాహనదారులు 108కి సమాచారం అందించటం వల్ల చికిత్స నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:కారులో ఇరుక్కుని ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details